ఆ వైసీపీ ఎమ్మెల్యేపై సొంత అన్న తిరుగుబాటు..టీడీపీలోకి జంప్!

అధికార వైసీపీలో తిరుగుబాటు నేతల సంఖ్య పెరుగుతుంది. ఓ వైపు కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వ తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. మరికొండఋ నేతలు ఏమో సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు.

తాజాగా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ సొంత అన్న సుదర్శన్..టీడీపీలో చేరిపోయారు.  ఎమ్మెల్యే సుధాకర్‌ తనకు స్వయానా తమ్ముడని.. తాము 30 ఏళ్లు టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి అనుచరులుగా ఉన్నామని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి కోడుమూరు టికెట్‌ తెచ్చుకున్నారని, దీంతో తామంతా టీడీపీని వీడి వైసీపీలో చేరామని, నియోజకవర్గంలోని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరినీ కలుపుకొని సుధాకర్‌ గెలుపు కోసం బాగా కష్టపడ్డామన్నారు.

అలాగే సుధాకర్ గెలుపు కోసం తాను రూ.30 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ డబ్బులు అడుగుతానేమో అని, తనని దూరం పెట్టారని అన్నారు. సుధాకర్‌ నమ్మక ద్రోహి.. సొంత ప్రయోజనాలే తప్ప ఎవరినీ పట్టించుకోరు అంటూ సుదర్శన్ మండిపడ్డారు. ఇదే క్రమంలో టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. కోడుమూరు టీడీపీ సీటు ఎవరికిచ్చిన వారి విజయం కోసం కృషి చేస్తామని సుదర్శన్ చెప్పుకొచ్చారు.

అయితే కోడుమూరులో మొదట నుంచి టీడీపీకి పెద్ద పట్టు లేదు..కానీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ గెలవడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త గట్టిగా కష్టపడితే ఇక్కడ టీడీపీ గెలుపుకు ఛాన్స్ ఉంటుంది. ఈ సీటు కోసం ఆకేపోగు ప్రభాకర్ ట్రై చేస్తున్నారు. మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.