ఉమాకు కేశినేని కౌంటర్లు..త్యాగం చేస్తారా?

విజయవాడ రాజకీయాల్లో టీడీపీ సీనియర్లుగా ఉన్న కొందరు నేతలకు మొదట నుంచి పడని పరిస్తితి ఉంది. వారికి ఎప్పటినుంచో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. అటు కేశినేని, దేవినేని ఉమాలకు పడదు. వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పటిలోనే కొడాలి నాని తిరుగుబాటు చేయడానికి ఉమా కారణమని చెప్పి కేశినేని విమర్శించారు.

తాజాగా మరోసారి ఉమా టార్గెట్ గా కేశినేని విరుచుకుపడ్డారు. మైలవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని..వైసీపీ ఎమ్మెల్యే పిలిచిన సరే వారి సభకు వెళ్తానని, మైలవరం ఎమ్మెల్యే బాగా పంచేస్తున్నాడు కాబట్టి తన ఎంపీ నిధులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. నాలుగు సార్లు గెలిచానని ఇగోకు పోతే ప్రజలు సరైన సమాధానం చెబుతారని, జగన్‌ని ఎదుర్కోవాలంటే అంతా కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సారి సీనియర్లు పార్టీ గెలుపు కోసం త్యాగానికి రెడీ అవ్వాలని అన్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్ధులు ఖరారు అవుతారని కేశినేని చెప్పుకొచ్చారు. కేశినేని మాటలు బట్టి చూస్తే పరోక్షంగా ఆయన ఉమాని టార్గెట్ చేశారని అర్ధమవుతుంది..అలాగే వైసీపీ ఎమ్మెల్యే వసంత టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని పరోక్షంగా చెప్పారు.

అలాగే నెక్స్ట్ మైలవరం సీటు ఉమాకు రాదని తెలుస్తోంది. ఇటు కేశినేని సీటు విషయంలో కూడా గ్యారెంటీ కనిపించడం లేదు. మరి కృష్ణా జిల్లాలో ఎంతమంది నేతలకు సీటు దక్కదో..ఎంతమందికి దక్కుతుందో చూడాలి.