చిరంజీవిపై క్షుద్ర ప్రయోగం.. ఎందుకో తెలిస్తే నువ్వు ఆగదు..!

మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం జరిగిందా..? అనే ప్రశ్నకు తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అభిమాని చిరంజీవిపై ఎందుకు విష ప్రయోగం చేశాడు? మెగాస్టార్ దీని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు కూడా నెలకొల్పాడు చిరు.

చిరు నటించిన మరణ ”మరణమృదంగం” సినిమా షూటింగ్ సమయంలో అక్కడ ఆయనపై విష ప్రయోగం జరిగిందట. ఓ అభిమాని షూటింగ్ విరామం సమయంలో కేక్ తీసుకొచ్చి బలవంతంగా తనకు నోట్లో పెట్టబోయాడు.. అది చేదుగా ఉండడంతో తినకుండా వెంటనే బయటకు ఊసేశాను ఆ తర్వాత ఈ విషయాన్ని అక్కడ సెట్ లో ఉన్న వారికి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

వెంటనే నిర్మాత అసలు విషయం తెలుసుకుని అతన్ని పట్టుకుని నాలుగు తగిలించడంతో అసలు విషయం బయట పెట్టాడట.. అసలు విషయం ఏమిటంటే చిరు ఆ అభిమాని పట్టించుకోవటం లేదని కేరళ వెళ్లి మరి చిరు పై వశీకరణం చేయించి పూజలో వాడే ముందును కేక్ లో కలిపి ఆయనకు తినిపించగా ఈ విషయం తెలియడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అభిమాని తాను అతనితో మాట్లాడటం లేదని అలా చేశాడని చెప్పడంతో అతని వదిలేసానని చిరు చెప్పాడు. ఇప్పుడు చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈరోజు ప్రేక్షకు ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆ కొట్టుకుందని తెలుస్తుంది.