ఎమ్మిగనూరులో రచ్చ..సీటు ఎవరికి దక్కేది?

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. అది సీటు విషయంపై పోటీ కనిపిస్తోంది. ఎమ్మిగనూరు సీటు దక్కించుకోవాలని వైసీపీలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేగా చెన్నకేశవ రెడ్డి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2012లో వైసీపీలోకి వచ్చి ఉపఎన్నికల్లో గెలిచారు. 2014లో ఓడిపోగా, 2019 ఏన్నికల్లో మళ్ళీ సత్తా చాటారు.

అయితే వయసు మీద పడుతుండటంతో నెక్స్ట్ ఆయన పోటీకి దూరం అవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఆ విషయాన్ని సీఎం జగన్‌కు కూడా స్పష్టం చేశారని తెలిసింది. నెక్స్ట్ ఏన్నికల్లో తాను పోటీ చేయలేనని, తన బదులు తన తనయుడుకు సీటు ఇవ్వాలని జగన్‌ని కోరినట్లు చెన్నకేశవ స్పష్టం చేశారు. అంటే నెక్స్ట్ చెన్నకేశవ పోటీకి దూరమైనట్లే. ఇక చెన్నకేశవ తప్పుకుంటున్న నేపథ్యంలో ఎమ్మిగనూరు సీటు దక్కించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి..తన తనయుడుకు గాని, తన అన్న తనయుడుకు గాని సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

అటు వీరశైవ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రగౌడ్ సైతం ఎమ్మిగనూరు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే మాజీ ఎంపీ బుట్టా రేణుకా సైతం ఎమ్మిగనూరు సీటు కోసం చూస్తున్నారు. దక్కితే కర్నూలు ఎంపీ సీటు లేదంటే ఎమ్మిగనూరు సీటు అని రేణుకా ట్రై చేస్తున్నారు. ఇలా ఎమ్మిగనూరు సీటు కోసం ఇంతమంది నేతలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఆ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.