చిరు-బాలయ్య కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా తెలంగాణలో అదనపు టికెట్లు రేటుకు అనుమతి పొందాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల రేటుకు అనుమతి ఉంటుందా లేదా అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే విడుదలకు రెండు రోజులు సమయం ఉండంగానే వీరసింహారెడ్డి మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.

USA Box Office @ Sankranthi: Kamma, Kapu & 'Bulk' Edupu Started
వీర సింహారెడ్డి సినిమా యొక్క వివాదాస్పందమైన డైలాగుల వల్ల టికెట్ల రేటుకి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పకపోవచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వీరసింహారెడ్డి ట్రైలర్ డైలాగులు ఏ స్థాయిలో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా కూడా బాలయ్య సినిమాకు టికెట్ల రేటు పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఓకే చెప్పింది.కానీ చిరంజీవి సినిమాకు.. రూ.25 రూపాయలకు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా బాలయ్య సినిమాకు రూ.20 రూపాయలు మాత్రమే అనుమతి ఇచ్చింది. టికెట్ల రేట్లు పెంపుకు అనుమతులు ఇవ్వడంతో వెంటనే అడ్వాన్స్ బుకింగ్లు కూడా మొదలయ్యాయి.

బాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రత్యక్ష కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతి సినిమాల యొక్క నిర్మాతల టెన్షన్ కాస్త తగ్గిందని చిత్ర బృందం భావిస్తోంది .ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేటు పెంపుకు ఓకే చెప్పడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా అప్పుడే మొదలు పెట్టడం జరుగుతున్నాయి. మరి సినిమాల విషయానికి వస్తే దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి బాలకృష్ణ తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. మరి ఏ సినిమా అభిమానులను అలరిస్తుందో చూడాలి మరి.