తన చావును ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్స్ గా ఉన్న నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర హీరోలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రజలు మరువని గొప్పతారాలలో వీరు కూడా ఒకరు. మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఏఎన్నార్లతో పాటు .. డి రామానాయుడు దాసరి వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీకి ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు.

ANR Family Press meet Unseen Pics - YouTube
అయితే ఏఎన్ఆర్ చివరి వరకు రాజకీయాల వైపు మొగ్గు చూపలేదు.చివరి శ్వాస వరకు సినిమాలలోనే నటిస్తూ మరణించారు. లెజెండ్ ఏఎన్ఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు నాగార్జున ఈ విషయాన్ని ఖండించారు. ఏఎన్ఆర్ బయోపిక్ చేసి సాహసం ఎవరు చేయలేమని ఆయన సినిమాలు కూడా చేయలేనివని తెలిపారు నాగార్జున. ఏఎన్ఆర్ ఒక నట శిఖరం మాత్రమే కాదు.. గొప్ప ప్రణాళిక బద్ధమైన జీవితానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్రమశిక్షణ కటోరమైన శ్రమ పోరాటం పాడిన ధైర్యం ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఆయనలో ఉన్నాయని .. ఆయన సన్నిహితులు తెలియజేస్తూ ఉండేవారు.

Digital NTR, ANR in Mahanati?
సరిగ్గా అక్కినేని మల్టీ స్టార్లర్ చిత్రం మనం రిలీజ్ సమయంలో తనకు క్యాన్సర్ ఉందని ఎంతో కాలం బతకనని ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని చెప్పారట.. దీంతో అక్కడున్న మీడియా వారంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా తెలిసి ఆయన చూపించిన తెగు ధైర్యం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఆయన ధైర్యానికి హ్యాండ్సప్ చెప్పారు. చివరి నిమిషంలో కూడా సినిమాల గురించి మాట్లాడారట ఏఎన్ఆర్.