ఇంకా మహేష్ కావాలంటున్న శ్రీవల్లి.. బాలీవుడ్ కి వెళ్లిన వదిలిపెట్టలేదుగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా విడుదలకు ముందు రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తూ రిలాక్స్ అవ్వటం తన హాబీ. మహేష్ ఎప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్ మోడ్ లోనే ఉంటాడు. ఇప్పుడు మహేష్ లానే విదేశీ వెకేషన్లు ఎంజాయ్ చేయడాన్ని అలవాటు చేసుకుందట ఓ స్టార్ హీరోయిన్. రీసెంట్ గానే ఈ హీరోయిన్ వరుస విదేశీ వెకేషన్లకు వెళుతూ.. వరుస సినిమా షూటింగ్స్ తో అలసిపోతూ రిలాక్స్ అయ్యేందుకు మైండ్ ఫ్రెష్ కోసం విదేశీ సముద్ర తీరాలను విలాసవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటుంది.

మరి ఈ హీరోయిన్ మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌. ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుస వెకేషన్లకు వెళుతూ తన హాట్ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రష్మిక బాలీవుడ్ లో తాజాగా నటించిన మిషన్ మజ్ను యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక మహేష్ బాబు లాగే వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

అందులో భాగంగా తనను హాలిడే బగ్ కరిచిందని సెలవుల కోసం ఎదురుచూస్తున్నుఅంతేకాకుండా ఇటీవల హాలిడే ట్రిప్ నుంచి ఒక ఫోటోని కూడా రష్మిక షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు ట్రెండీ లుక్ లో సుందరమైన లొకేషన్ ని ఆస్వాదిస్తూ రిలాక్స్ గా కనిపించింది. బ్లాక్ సన్ గ్లాసెస్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.