పవన్ భీమ్లా నాయక్ సినిమాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా తన సినీ కేర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఎలాగైనా రాణించాలని వచ్చే ఎలక్షన్లకు తన సత్తా చాటాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.

Review : Bheemla Nayak – Intense Action Drama | 123telugu.com
ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సమయంలో టికెట్ల రేట్లు కూడా తగ్గించాలంటు జగన్ ప్రవేశపెట్టిన జీవో వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని కోట్ల నష్టపోయినట్లు వార్తలు వినిపించాయి.ఆ జీవో వల్ల పుష్ప, అఖండ వంటి సినిమాలకు కూడా భారీగా నష్టాలు వచ్చినట్లుగా సమాచారం. ఇక తర్వాత చిరంజీవి ,మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి సమస్యను పరిష్కారానికి తీసుకువచ్చారు. తమ సినిమాలను ఆ విధంగా తొక్కడంపై పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన యువశక్తి మహాసభలో మాట్లాడడం జరిగింది.

Bheemla Nayak Day 2 Box Office Collection - Sacnilk
ఆయన మాట్లాడుతూ మీరు నన్ను ఎన్ని విధాలుగా భయపెట్టాలని చూసిన తన సినిమాలను అణిచివేయాలని చూసిన నేను ఎవరికి భయపడను అంటూ తెలియజేశారు. భీమ్లా నాయక్ సినిమాని ఆపేయాలని చూసిన నిర్మాతలకు రూ .30 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని తెలిపారు. ఆ నష్టాన్ని నేను భరించాను ఇవన్నీ నాకు ఒక లెక్క కాదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా చేత వెనుకడుగు వేయించలేరు అంటూ పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు ఎన్ని కోట్లు నష్టం వచ్చిందని విషయం తెలియజేయడం జరిగింది.