ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏపీ వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర రాజకీయ యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువచ్చిన జీవో 1/2023 మరింతగా రాజకీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్రబాబు కుప్పం టూర్‌పై ఇప్పుడే కాదు గతంలోనూ వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా ఆంక్షలే వచ్చాయి. తాజాగా జగన్ సర్కార్ తెచ్చిన జీవోపై
చంద్రబాబు కూడా అదే రేంజ్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇక, తాజాగా హైకోర్టు జీవో 1ని సస్పెండ్ చేసింది. దీనికి చట్ట నిబంధనలు ఒప్పుకోవడం లేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తామని.. పేర్కొంటూ.. ఈ నెల 20న డేట్ ఫిక్స్ చేసింది. ఇక, ఈ జీవోను 23వ తేదీ వరకు నిలుపుదల చేసింది. అయితే.. దీనిని ఉటంకిస్తూ.. చంద్రబాబు తాజాగా ట్వీట్ చేశారు. మితిమీరిన భయమే మనిషిని ఒక్కొక్కసారి సైకోగా మారుస్తుంది అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. “తాను అధికారం కోల్పోతానన్న భయంతోనే జగన్ రెడ్డి జీవో 1 తెచ్చి.. తానొక సైకో అని చాటారు. టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం కూడా ఈ సైకో మనస్తత్వానికి నిదర్శనం“ అని బాబు ట్వీట్ చేశారు. అయితే.. దీనిపై సంచలన దర్శకుడు.. వైసీపీ స్టాండ్ తీసుకున్న రాంగోపాల్ వర్మ.. సటైరికల్‌గా స్పందించారు.
“ఓహో అలానా.. సైకియాట్రిస్టు గారూ!!“ అని చిన్న కామెంట్ చేశారు. అయితే.. ఇది తీవ్ర వ్యంగ్యంగా ఉండడంతో సోషల్ మీడియా జనాలు.. నీకు రాజకీయాలు ఎందుకు.. సినిమాలు చేసుకోక.. అని మండిపడుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబును మరీ ఇంతగా ఆడిపోసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వాళ్లు కూడా అమ్మాయిల కాళ్లు, వేళ్లు నాకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే నువ్వా నీతులు చెప్పేది అని విరుచుకు పడుతున్నారు. ఇక కొద్ది రోజులుగా చంద్రబాబు, టీడీపీని విమర్శిస్తోన్న వర్మ చంద్రబాబు టార్గెట్‌గా కొత్త సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.