ఈతరం హీరోలలో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఆ పని సాధ్యమైందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు డ్యూయల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలో నటించడం చాలా తక్కువగానే జరుగుతోంది. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో ఇన్ని పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయం ఒక వింతగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ వంటి వారు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలో నటించారు. అయితే ఇలా నటించడం రాను రాను తగ్గిపోయిందని చెప్పవచ్చు.

Jr. NTR's 'Jai Lava Kusa' rocks box office: Here's how much it made on Day  1 of release | The News Minute
ఇక కమలహాసన్ మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక విచిత్రమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. అలా మైకేల్ మదన కామరాజు సినిమాలో త్రిబుల్ రోల్ లో దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రలలో నటించారు. ఇలా నటించడం మరే నటుడికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇలా ఒకటి నుంచి ఎక్కువ పాత్రలో నటించడం చాలా తక్కువ మంది ఉన్నారు. చిరంజీవి వంటి వారు కేవలం త్రిబుల్ రోల్స్ పాత్రలోనే నటించారు. ముఖ్యంగా ఇలా నటించినప్పుడు బలమైన కథ ఉండాలి ఆ కథ బలమైనది కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ గా మిగులుతుంది. అలా చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా పరిస్థితి ఇలానే అయింది.

ఇక ఈతరం హీరోలలో ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ సినిమాలో మూడు పాత్రలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక రానున్న రోజుల్లో డబల్ రోల్ చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలే ఉన్నాయని చెప్పవచ్చు. రవితేజ వంటి వారు డ్యూయల్ రోల్స్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ కూడా డ్యూయల్ రోల్ పాత్ర సినిమాలు చాలానే చేశారు.