గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన రెండు సినిమాలు అవే..

2022వ సంవత్సరం ముగియడానికి వచ్చింది. త్వరలోనే 2023లో అడుగు పెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీగా బ్రహ్మస్త్ర నిలిచినట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాను విడుదల చేసింది.

ఈ సంవత్సరం 11 నెలలో అధికంగా ట్రెండింగ్‌లో ఉన్న లిస్ట్ ని ప్రకటించింది. ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో కెజిఎఫ్ -2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగవ స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదవ స్థానంలో కాంతారా నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప, విక్రమ్, లాల్ సింగ్ చద్దా, దృశ్యం-2, థోర్ లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి పది స్థానాలో ఐదు సినిమాలు సౌత్ వే ఉండగా, కేవలం నాలుగు హింది చిత్రాలు ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాయి.

గత కొంత కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా నడుస్తుంది. ఈ సమయంలో దానిని వెనక్కి నెట్టి బ్రహ్మస్త్ర సినిమా ముందు వరుసలో నిలవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సౌత్ ఇండస్ట్రీ లోని పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ -2, కాంతార, కార్తికేయ -2 వంటి సినిమాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను వసూలు చేయడంలో మాత్రం సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. అలానే వరల్డ్ వైడ్ గా సినిమా లవర్స్ ను అలరించడంలో మన సౌత్ ఇండియా సినిమాలే ముందుంటున్నాయి.