ఆ సీనియర్ స్టార్ హీరోతో అఫైర్ పెట్టుకున్న పూజా హెగ్డే..

ప్రముఖ నటి పూజా హెగ్డే తన అంద చందాలతో, నటన అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా స్టెప్పులు వేసి అందరికీ చెమటలు పుట్టిస్తుందీ భామ. ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు అదృష్టం కూడా ఉండటంతో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ ఛాన్సులు పట్టేస్తోంది. సౌత్ లోనే గ్లామరస్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అనే చెప్తున్నారు చాలా మంది.

ప్రస్తుతం పూజా మనసంతా బాలీవుడ్ వైపే వెళ్తుంది. కెరీర్ మొదలైన దగ్గర్నుంచి పూజా బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ కూడా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది కానీ విజయం సాధించలేకపోతుంది. ఆమె కెరీర్ ప్రారంభం అయిన తొలినాళ్లలో సౌత్ సినిమాలకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మరీ బాలీవుడ్‌లో ప్రయత్నించింది. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అయితే టాలీవుడ్‌లో మాత్రం డీజే సినిమాతో పూజా లెవెల్ మారిపోయింది. ఈ సినిమాతో తన గ్లామర్ ని ఎలా ఎక్స్‌పోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలో నేర్చుకుంది. ఇక ఇక్కడ బీజీగానె ఉన్న కూడా హిందీ మూవీలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ గ్లామరస్ బ్యూటీ బాలీవుడ్ బిగ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు.

కాగా తాజాగా పూజా హెగ్డే ఒకరితో అఫైర్ పెట్టుకున్నట్టు రూమర్స్ మొదలయ్యాయి. కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో ఫేమస్ అయిన వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు తాజాగా పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ల మధ్య లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ట్వీట్ చేశాడు. ‘బాలీవుడ్‌లో కొత్త ప్రేమ మొదలయింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్, గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఎక్కువ టైమ్‌ స్పెండ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే పూజా సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్‌లో ఇంకో రెండు సినిమాలకి కూడా సైన్ చేసింది’ అని ఉమైర్ ట్వీట్ చేశారు.

అయితే ఇవన్నీ ఉత్తి మాటలే అని కొట్టి పారేస్తున్నారు కొంతమంది. మరి కొంతమందేమో ఈ వార్తలో ఎంతో కొంత నిజం వుండే ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఇటీవల పూజా బర్త్‌డే సందర్బంగా ఆమెకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సెట్‌లోనే పూజా బర్త్ డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశాడు. అయితే నిజంగానే పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.