ఎక్స్ క్లూజీవ్: ఎన్టీఆర్ అదృష్ట జాతకుడు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్‌ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా తీసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్నారు. తనను నమ్ముకున్న దర్శకులను తారక్ ఎప్పుడు ఆదుకోవడంలో ముందే ఉన్నాడు.

NTR: Sukumar's Approach to Me Is a Trash | cinejosh.com

ఆ దర్శకులకు తన వంతు కృషి చేస్తూ వారికి విజయం అందించడంతో పాటు వారి కెరియర్‌ను నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ఏ అగ్ర డైరెక్టర్లకు ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారారని కొందరు చెబుతున్నారు. ఇక మహేష్ హీరోగా వచ్చిన 1నేను ఒక్కడినే సినిమా ప్రేక్షకుడి నుంచి మంచి కామెంట్స్ వచ్చిన సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది.

Is Bobby turning a liability for NTR ?

ఆ డైరెక్టర్ త‌ర్వాత ఆ డైరెక్టర్‌తో నాన్నకు ప్రేమతో సినిమాా చేసి అదిరిపోయే కమర్షియల్ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. పవర్ సినిమా తో డైరెక్టర్ గా మారిన బాబీకి మొదటి సినిమా హిట్ అయినప్పటికీ రెండో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్‌తో ప్లాప్ ను ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్ బాబీతో జై లవకుశ సినిమా చేసి అతనికి అదిరిపోయే హిట్ ఇచ్చాడు.

Jr NTR's Role From His Next With Trivikram Srinivas Revealed! Read To Know  More! - Filmibeat

అ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా తీసి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత మళ్లీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ తీసి ఎన్టీఆర్ కి సూపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మరో స్టార్ దర్శకుడు కొరటాల శివ కూడా ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నాడు. చిరంజీవితో ఆచార్య సినిమా తీసి తన కెరియర్ లోనే తొలిసారి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. ఇలా ఎన్టీఆర్ ఎందరో దర్శకులు విజయాలు లేక సతమతం అవుతుంటే వారికి అవకాశాలు ఇవ్వటం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న ఎందరో దర్శకుల కెరియర్ మధ్యలో ఆగిపోకుండా వారిని పరిశ్రమలో నిలబెడుతున్నారని కామెంట్లు వస్తున్నాయి.

Share post:

Latest