మెగా అభిమానులను హర్ట్ చేసిన మెగాస్టార్..నిలువునా ముంచేసాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Megastar Chiranjeevi's Waltair Veerayya Release Date Locked -  IndustryHit.Com

ఈ సినిమా జనవరి 13 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మెగా అభిమానులు మాత్రం కొంత అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ లో రావాలనుకున్న సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత వాల్తేరు వీరయ్య ప్రేక్షకులు ముందుకు రావడంతో పాటు ఈ సినిమా ఆ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నిటికన్నా తక్కువ థియేటర్లో విడుదలవుతుంది. ఇక దీంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తేడా వస్తుందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Chiru Boss Party Song is here... Devisree Pedda Raad, Rambola Dimpeshav  Basoo.. (Video) » Jstimesnow

ఈ సినిమా కన్నా ముందు విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వాల్తేరు వీరయ్య కలెక్షన్ల విషయంలో గండి పడే అవకాశం ఉంది అంటూ సినీ ట్రేడ్ వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. అయితే మరి కొంతమంది మాత్రం చిరంజీవి కచ్చితంగా హిట్ అందుకుంటాడని అందుకే ఆ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదల విషయంలో ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేక ఇక ఆచార్య లాగా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తాడా అని తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.