లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి.. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా షూటింగ్ చాలాకాలం నుండి జరుగుతున్నప్పటికీ అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమంత అనారోగ్యానికి గురవడం.. ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా వెళ్లారు.
ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.. సమంత మయోసైటిస్ నుండి సంపూర్ణంగా కోల్కొనే అంతవరకు షూటింగ్స్ లో పాల్గొనదని డాక్టర్లు ఎంతో స్ట్రిక్ట్ గా చెప్పారట… ఇక దీనితో సమంత షూటింగ్ కి రావాలంటే మరో ఆరు నెలలు టైం పడుతుందని.. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ను తీసుకుని షూటింగ్ చేసే పరిస్థితి కూడా లేదు.
సమంత మరో 3 నెలలు లోపు రాకపోతే ఈ సినిమాను క్యాన్సిల్ చేయడం మంచిదని ఈ సినిమా నిర్మాత భావిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇక దీంతో సమంత తొందరగా కోలుకొని షూటింగ్లో జాయిన్ అవుతుందా.. మరింత సమయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ మాత్రం తన డేట్స్ మొత్తం ఈ సినిమాకి కేటాయించాడు.. తను అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయి ఉంటే, సినిమాని ఈనెల 25న ప్రేక్షకులల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సమంత అనారోగ్యానికి గురవటం సినిమా యూనిట్ ప్లాన్ అన్నిటిని తలకిందులు చేసింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గౌతం తిన్నూరితో త్వరలో సినిమా చేయబోతున్నాడట విజయ్. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే సంవత్సరం జనవరి నుంచి మొదలు పెడతారని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.