టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉంటాడు మహేష్. ఇక మన హీరోకి ఎంత నిబద్ధత అంటే తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి మరీ షూటింగ్స్ కి హాజరవ్వుతున్నాడు. నిత్యం అభిమానుల ఆనందంకోసం పనిచేసే ప్రిన్స్ అంటే అభిమానులకు ఎనలేని అభిమానం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో నటించారు. కాగా ఈ యాడ్ నెట్టింట్లో దుమ్ముదులుపుతోంది.
ఈపాటికే మహేశ్ బాబు అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా వున్న సంగతి విదితమే. కాగా ఆయన తన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. కాగా ఈ వాణిజ్య ప్రకటనను త్రివిక్రమ్ పర్యవేక్షణలో మహేశ్ బాబు తనదైన శైలిలో అదరగొట్టాడు. కాగా దీనికి సంబంధించిన వివరాలను ఎవరెస్ట్ స్పైసెస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ యాడ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. పోస్ట్ చేస్తూ “సౌత్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి భోజనం తయారీలో ఎవరెస్ట్ గరం మసాలానే వాడతారన్న విషయం ఇప్పుడే తెలిసింది” అంటూ ప్రచారం షురూ చేసారు.
ఇకపోతే ఈ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఆ యాడ్ లో మహేష్ హెయిర్ స్టైల్ మొదలుకొని మీసం, గడ్డం వరకు ప్రతి ఒక్కటి బాగా సెట్ అయ్యాయి అని ఘట్టమనేని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యాడ్ మరియు మహేష్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సంక్రాంతి తర్వాత మొదలుకాబోతోందని సమాచారం. ఇకపోతే ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయాలని ముందు అనుకున్నా, షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల రిలీజ్ కాస్త లేట్ కావొచ్చని సమాచారం.