హీరోయిన్ హంసా నందిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. గ్లామర్ ని వెండితెరపైన వండి వార్చడంలో ఈ ముద్దుగుమ్మది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. అందుకే కుర్రాళ్ళు హంసా నందిని అంటే పడిచస్తారు. ఇక మన తెలుగు వారికి అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాలతో బాగా పరిచయం అయింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తోనే తెలుగు తెరకు అరంగేట్రం చేసింది. ఈ రెండే కాకుండా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన సంగతి విదితమే.
కాగా తాజాగా దానికోసం చికిత్స తీసుకున్న హంసా నందిని దానినుండి విజయవంతంగా బయటపడినట్టు సమాచారం. కాగా తిరిగి మరలా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. వంశ పారంపర్యంగా ఆమెకి ఈ బ్రెస్ట్ కేన్సర్ వచ్చినట్టు సమాచారం. 2021 డిసెంబర్ లో ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆమె ఈ విషయం బయటపెట్టింది. తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో 7 సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు అప్పుడే వెల్లడించింది. కాగా చేయవలసిన చికిత్సలు పూర్తై, ఆఖరికి దానినుండి విజయవతంగా బయటపడింది.
కాస్త విరామం తరువాత బుధవారం తిరిగి ఓ సినిమా షూటింగ్ కు హాజరైన నేపథ్యంలో హంసానందిని తన తాజా ఆరోగ్య స్థితిని మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… “నాకు మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం కూడా మంచి తరుణమని భావిస్తున్నాను. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను మళ్ళీ వచ్చేశా” అని హంసా పోస్ట్ పెట్టింది.