చిరంజీవి, మహేష్‌లతో సహా ఈ ఏడాది వేరేవారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన హీరోలు వీరే…

 

టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు తమ సినిమా లోనే కాకుండా తోటి నటుల సినిమాల విషయంలో కూడా సహాయ పడుతూ ఉంటారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ చిత్రానికి చూడటానికి ముందుకు వస్తారు. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ బాగుండాలనుకోండి. అయితే ఈ ఏడాది కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి కొంతమంది హీరోలు హెల్ప్ చేసారు. ముఖ్యంగా వారి వాయిస్‌తో డబ్బింగ్ చెప్తూ లేదా పాటలు పడుతూ వేరే సినిమాలకు హెల్ప్ చేసారు. అయితే ఎలా హెల్ప్ చేసిన కొంతమంది హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి రణ్‌బీర్ కపూర్, అలియా బట్ నటించిన ‘బ్రహ్మాస్తా’ సినిమాకి తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలానే పోనియన్ సెల్వన్-1 కి కూడా చిరు వాయిస్ ఓవర్ అందించాడు.

• మహేష్ బాబు

వేరే భాష చిత్రాలకు కాదు కానీ మహేష్ ఏడాదిలో రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా కి వాయిస్ ఇచ్చాడు. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ, మహేష్‌కి మంచి స్నేహితుడు కావడంతో అతడు తన వాయిస్ ని అందించాడు.

• నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి దర్శకుడు ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించిన ‘మిషన్ ఇంపాజిబుల్ ‘ సినిమాకి ఓవర్ ఓవర్ ఇచ్చాడు.

• రాజమౌళి

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్ ‘ సినిమా కి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

• నాని

నేచరల్ స్టార్ నాని దీప్తి గంటా దర్శకత్వం వహించిన ‘మీట్ క్యూట్’ వెబ్‌సిరీస్ ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ అందించాడు. ఈ వెబ్ సిరీస్ కి నాని నిర్మాత.

• రానా

టాలీవుడ్ నటుడు రానా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోనియన్ సెల్వన్ -1 ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.