టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ తన ఆటతోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాతో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన గిల్.. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లకు సిద్ధమయ్యాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో అద్భుతమైన ఆటను కనబరిచి.. టీమిండియా వన్డే టెస్ట్, సిరీస్‌లో చోటు సాధించాడు గిల్.
గిల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. పంజాబ్ కు చెందిన శుభమన్‌ది వ్యవసాయ కుటుంబం. వాళ్ల నాన్న లిఖ్విందర్‌సింగ్ పంజాబ్ లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. శుభమన్ గిల్ కు షానీల్ గిల్ అనే సోదరి కూడా ఉంది. ఇక వీరిది పేరుకే వ్యవసాయటుంబం అయినా..ఆర్థికంగా వీరిది ఎంతో ఉన్నత కుటుంబం. క్రికెట్ ను తన కెరియర్‌గా ఎంచుకున్నన గిల్ ఇప్పుడు టీమ్ ఇండియాలో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు.
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు తన సేవలు అందిస్తున్నాడు. అయితే గిల్ సోదరి గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. షానీల్ గిల్ కు సోషల్ మీడియాలో ఇప్పటికే 51 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక తన సోషల్ మీడియాలో షాలిని తన స్నేహితులతో తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. అప్పుడు తన హాట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
చాలామందికి షానీల్ శుభమన్ గిల్ సోదరి అనే విషయం తెలియదు. ఆమె కేవలం తన అందంతోనే అంతమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె తన అందంతో బాలీవుడ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ఆమె పెట్టే హాట్ ఫోటోలకు నెటిజన్లు హీరోయిన్‌గా ట్రై చేయొచ్చు కదా అంటూ ఆమెకు సలహాలు కూడా ఇస్తున్నారు.
అయితే షానీల్ గిల్‌కు మోడలింగ్ రంగంపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. శుభమన్ గిల్‌కు తన సోదరి అంటే ఎంతో ఇష్టం. ప్రతి పుట్టినరోజుకు గిల్ ఆమేకు ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు.. వీటితోపాటు ఆమె గురించి పోస్ట్ చేస్తూ విషెస్ చెబుతాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ సోదరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram