టాలీవుడ్ లో హీరో గోపీచంద్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్నన హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. తన సినిమాలకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. రీసెంట్‌గా పక్క కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినన గోపీచంద్ కొంత నిరాశపరిచాడనే చెప్పాలి.
ఈ సినిమాకి ముందు సంపత్‌నంది దర్శకత్వంలో వచ్చిన సిటీ మార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత పక్క కమర్షియల్ సినిమాతో మరో ప్లాప్‌ను చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో తన తర్వాత సినిమా చేస్తున్నాడు.ఈసారి కూడా మరో హిట్ ఇస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు దసరా పండుగ సందర్భంగా శ్రీను వైట్లతో మరో సినిమా ప్రకటించాడు.
అయితే ఇప్పడు శ్రీవాస్ తో చేస్తున్న సినిమా టైటిల్ ను గోపీచంద్ రివీల్ చేసినట్టు ఓ ప్రచారం జరుగుతుంది. అది కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అన్నటు టాక్ వినిపిస్తుంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అ ఎపిసౌడ్‌కు సంభందించిన పస్ట్ లుక్ కూడా నిన్న రాత్రి విడుదల చేయ్యగా అ పస్ట్ లుక్ లో బాలయ్య, ప్రభాస్, గోపిచంద్ తో చేసిన రచ్చ మాములుగా లేదు.
ఈ శుక్రవారం రాబోతున్న ఈ ఎపిసోడ్ లో వీరిద్దరూ స్నేహితులు ప్రేక్షకులను అలరించాబోతున్నారు.మరి ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ తన సినిమా టైటిల్ ను రివీల్ చేసినట్టు టాక్. ప్రెజెంట్ గోపీచంద్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”రామబాణం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరి ఇదులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇప్పుడు వార్త సోషల్ మీడియలో వైరల్ గా మారింది.