ఎన్నికలలో పోటీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్ ఆలీ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ ఆలీ.. దాదాపుగా 40 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఆలీ ఇప్పటికీ అడప దడప సినిమాలలో నటిస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో ఆలీ పైన ఇప్పుడు పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన ఆలీ తన పార్టీలోకి చేరకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసిపి పార్టీ తరఫున ప్రచారాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పైన రివర్స్ కామెంట్లు కూడా ఎవరు ఊహించని విధంగా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Veteran Telugu Comedian, Actor Ali's Mother Passes Away Due to Age Related  Illness

ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆలీ పాలిటిక్స్ లో మాత్రం బిజీ కావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అతనికి సపోర్ట్ ను గుర్తించిన వైయస్ జగన్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా పలు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే తాను ఈ బాధ్యతను తీసుకోబోతున్నట్లు కూడా ఇటీవలే ఆలీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. మొన్నటి వరకు తన కూతురు వివాహ హడావిడిలో బిజీగా ఉన్న ఆలీ వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు ఆలీ సమాధానం తెలియజేసినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఆలీ మాట్లాడుతూ.. నేను చేసిన వర్కును చూసి ఇప్పుడు తనకు ఒక బాధ్యత అప్పగించారు. అది తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఇప్పుడు నేను పార్టీకి ఉపయోగపడే విధంగా నా పనిని కొనసాగించాలనుకుంటున్నాను. ఆ తర్వాత వారు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా నేను సిద్ధమే అని తెలియజేశారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండే విధానంపై పలుచర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఆలీ. మరి వచ్చే ఎన్నికలలో ఆలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి మరి.