Unstoppable 2: ఆ ఒక్క మాటతో భయపడిపోయిన ప్రభాస్‌..గోపిచంద్ ఇరిక్కించేసాడుగా..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ , స్టైల్ అన్ని మార్చేసిన ప్రభాస్ ..ప్రజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా అమ్మాయిల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చిన సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ రెబల్ హీరో.

నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో రీసెంట్గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే . మొదట పోస్టర్ తో కన్ఫామ్ చేసిన ఆహా.. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే క్రేజీ గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఎపిసోడ్ పై భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేసింది . ఈ గ్లింప్స్ రిలీజ్ అయ్యి కొద్ది గంటలు కూడా కాకముందే రెబెల్ ఫాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య కూడా ప్రభాస్ తో సరి సమానంగా ఎంజాయ్ చేసినట్లు ఈ వీడియో చూస్తూనే అర్థం అయిపోతుంది .

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఓ విషయం బాగా కదిలించింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓ షాట్లో పాస్ చేసి మరి జూమ్ చేసి ఆ క్లిప్ ను దీర్ఘంగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ భయపడి పోయి వెనక్కి వెళ్ళాడు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలయ్య ఓ టాస్క్ లో భాగంగా ప్రభాస్ ని స్టెప్స్ వేయమన్నాడని.. ఈ క్రమంలోనే ఆయన భయపడిపోయి నావల్ల కాదు బాబోయ్ అంటూ వెనక్కి వెళ్లిపోయాడని తెలుస్తుంది .

అంతేకాదు మరో షాట్ లో ప్రభాస్ గోపీచంద్ కి చేతులెత్తి దండం పెట్టేస్తాడు. “పెళ్లంటే భయపడిపోతున్నాడు మా హీరో అంటూ గోపీచంద్ చెప్పడంతోనే అలా ప్రభాస్ దండం పెట్టేసాడు ..అంతే కాదు తన పాత లవ్ స్టోరీ ని కూడా బాలయ్య ముందు ఓపెన్ గా చెప్పేసాడని”. ఈ క్రమంలోనే ప్రభాస్ చేతులెత్తి దండం రా బాబు నీకు అంటూ సరదాగా నవ్వుకున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే కేవలం గ్లింప్స్ నే ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుంటే ..పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే మాత్రం అన్ స్టాపబు చరిత్ర తిరగరాయబోతుంది టీఆర్పీలతో అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి కానుకగా డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.