బెడ్ పై కేతిక టెంప్టింగ్ పోజులు.. ఎంత చూపించినా ప‌ట్టించుకునే నాథుడే లేడు!

కేతిక శర్మ ఈ హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ `రొమాంటిక్` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇందులో హీరోగా నటించాడు.

గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కేతిక శర్మకు యూత్ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆ తర్వాత లక్ష్య‌, రంగరంగ వైభవంగా చిత్రాల్లో కేతిక నటించింది.

అయితే ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. వ‌రుస‌ ఫ్లాపుల నేపథ్యంలో కేతిక శర్మకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో అందాలన్నీ బయట పెట్టేస్తోంది.

తాజాగా మరోసారి విజువల్ ట్రీట్ ఇచ్చింది. పొట్టి నిక్కర్ మరియు హాఫ్ టాప్ లో నాభి అందాలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ బెడ్ పై టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేతిక‌ అందాలకు కుర్ర‌కారు ఫిదా అయిపోతుంది. అయితే పలువురు నెటిజ‌న్లు మాత్రం ఎంత చూపించినా కేతిక‌ను పట్టించుకోని నాథుడే లేడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కేతిక కెరీర్ ప‌రంగా ఎప్పుడు స్పీడంద‌నుకుంటుందో చూడాలి.