జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ల కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని తయారు చేయించుకున్నారు. ఆ రథానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. గత నాలుగు రోజులగా పవన్ కళ్యాణ్ వారాహి రథం పేరు వార్తలో నిలుస్తూ వచ్చింది. వారాహి రంగుపై కూడా రాజకీయ వివాదం నడుస్తుండగానే.. జన సైనికులు ఇది తమ ప్రచారం రథమంటూ పవన్ ప్రచార రథం ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును పవన్ వారాహి రథానికి ఉపయోగించారని.. కాబట్టి ఆ వాహనం రిజిస్ట్రేషన్ చెల్లదని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ వివాదం నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ ఆ రథానికి తెలంగాణ రవాణా శాఖ నుంచి రిజిస్ట్రేషన్ అనుమతులు జారీ చేసింది.
ఆ రథానికి TS13EX8384 పేరుతో రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా కేటాయించింది. అది వైసిపి నేతలు చెప్పినట్టు పవన్ వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కాదు.. అది ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ నంబర్ ను పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నెంబర్ చివరి 4 అంకెలను వారహి రిజిస్ట్రేషన్ నెంబర్ కు కేటాయించినట్టు ఆన్లైన్లో వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రథం నెంబరు.. పుష్పసినిమాలో హీరో ఫోన్ నెంబర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
8384 🔥🔥@Pawankalyan’s ‘Varahi’ vehicle registration number & @alluarjun’s phone number in Pushpa are same 😅 pic.twitter.com/yRrBcd9dpI
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) December 13, 2022