టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సోలో హీరోగానే వరుస సినిమాలు అందుకుంటూ ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు మల్టీ స్టార్లర్ పైన దృష్టి పెడుతున్నారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం సింగిల్ గానే నటిస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు మల్టీ స్టార్లర్ చిత్రాలలో నటించిన పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో మల్టీ స్టార్ చిత్రాలలో నటించలేదు.
ఈ కారణంగానే బాలయ్య మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో కూడా మరి అద్భుతమైన కథ వస్తె కచ్చితంగా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి బాలయ్య ఆసక్తి ఉన్నాడని విషయాన్ని ఆహా ఓటీటి వేడుకలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య సోలో గానే హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య , డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఇక తర్వాత డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో, పరుశురామ్ దర్శకత్వంలో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఈ చిత్రాలన్నీ మంచి అంచనాలతో భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నాయి. ఇక వీరసింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా రూ.110 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏ హీరోతో బాలయ్య మల్టీ స్టార్ సినిమాని తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది.