రెహమాన్‌తో అట్లుంటది మరి.. అతడి పారితోషికం ఎంతో తెలిస్తే..!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అవార్డు విన్నింగ్ మ్యూజిక్ అందించాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ ఎన్నో ఇండియన్ మూవీస్ సినిమా అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఈయన సంగీతంతోనే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఏ.ఆర్ రెహమాన్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌- 1’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించగా, విజయ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, త్రిష లు లీడ్ రోల్స్ లో మెరిసారు. పొన్నియన్ సెల్వన్ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. పొన్నియన్ సెల్వన్ సినిమా విజయంలో ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.

మరి ఇంత మంచి మ్యూజిక్ అందించే రెహమాన్ ఒక్కో సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటాడు? అనే సందేహం ఉండటం సహజం. కాగా తాజాగా అతని రెమ్యునరేషన్ గురించి ఓ వార్త బయటికి వచ్చింది. అదేంటంటే ఈ దిగ్గజ సంగీత దర్శకుడు ఒక్కో సినిమాకి దాదాపు రూ.6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అయితే అద్భుతమైన సంగీతం, హిట్ సాంగ్స్ అందించగల సత్తా ఉన్న ఏ.ఆర్ రెహమాన్ రూ. 6 కోట్లు పారితోషికం తీసుకోవడం పెద్ద వింతేమీ కాదు అని అంటున్నారు కొంతమంది. మరికొంతమందేమో ఒక సినిమా కి రూ. 6 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారు.