ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయిన సినిమాలు ఇవే…

ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. ఇక ఈ ఏడాది సినిమాల విషయానికి వస్తే అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్‌లో విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది. కానీ పోయిన ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది సక్సెస్ తగ్గిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ హీరో, హీరోయిన్స్ అని చూడకుండా కథకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి టాక్ తెచ్చుకొని రిలీజ్‌ అయిన తరువాత బాక్సఫీస్ వద్ద బొక్కబోర్లా పడి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకి భారీగా నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మనం అలాంటి సినిమాల గురించి తెలుసుకుందాం.

రాధేశ్యామ్

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. మూడు వందల కోట్లతో, నాలుగేళ్ల పాటు రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా కథలో కొత్తధనం లేకపోవడంతో డిజాస్టర్ అయింది. దాదాపు రూ.85 కోట్లకు పైగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది.

ఆచార్య

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇది కూడా డిజస్టర్ గా మిగిలిపోయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా హిట్ తరువాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కథలో చిరంజీవి క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ క్యారెక్టర్ ని హైలెట్ చేయడానికి ప్రయత్నించగా అది బెడిసి కొట్టింది. ఈ సినిమా రూ.80 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది.

లైగర్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ మూవీ రూ.60 కోట్ల వరకు ఎగ్జిబీటర్లకు నష్టం కలిగించింది.

ది ఘోస్ట్

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందించి ఘోస్ట్ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా దసరా పండుగ సందర్బంగా విడుదల అయింది. ఈ సినిమాలో యాక్షన్ అతిగా మారి ఎమోషన్స్ తగ్గడంతో ప్లాప్ అయింది. అలా నిర్మాతలకు రూ. 20 కోట్ల నష్టాన్ని కలిగించింది.

ది వారియర్

లింగస్వామి, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన వారియర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది నిర్మతలకు రూ.20 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చి పెట్టింది.

థాంక్యూ

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ దిల్ రాజుకి రూ.22 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.