కీరవాణి ఇంట తీవ్ర విషాదం..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలకు సంగీతాన్ని అందించే దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ వరుసకి అన్నదమ్ములు కూడా అవుతారు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ముఖ్యంగా కీరవాణి అందించే సంగీతమే హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలకు కూడా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

M.M.Keeravani Family Wife Biography Parents children's Marriage Photos

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు మరణం మరువకముందే కృష్ణ కూడా మరణించడంతో ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి తల్లి కూడా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ రోజున ఈమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో కీరవాణి కుటుంబ సభ్యులు మొత్తం శోకసముద్రంలో మునిగిపోయారు.

సినీ ప్రేమికుల సైతం ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. వరసకి రాజమౌళికి ఈమె పిన్ని కూడా అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా హుటాహుటిగా కీరవాణి ఇంటికి బయలుదేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కీరవాణి తల్లి మరణానికి గల కారణం ఏంటనే విషయం పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతం కీరవాణి కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.