గొంతు క్యాన్స‌ర్‌తో చ‌నిపోయే ముందు క‌మెడియ‌న్ రాజ‌బాబు రాసిన లెట‌ర్ ఇదే… క‌న్నీళ్లు ఆగ‌వుగా…!

తెలుగు సినిమా పరిశ్రమంలో ఎందరో కమెడియన్లు తమ నటనతో ప్రేక్షకులను ఇప్పటికీ మెప్పిస్తున్నారు. అలా తన నటనతో హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుని అగ్ర కమెడియన్గా వెలిగిన వారిలో సీనియర్ కమెడియన్ రాజబాబు కూడా ఒకరు. 50 – 60 దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కమెడియన్ గా కొనసాగుతున్న రాజబాబు అప్పుడు ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోలకు సమానంగా సినిమాలలో నటిస్తూ బిజీ కమెడియన్ గా కొనసాగారు.

Comedian Raja Babu: ఆ విధంగా 'అప్పలరాజు' కాస్త 'రాజబాబు' అయ్యాడు ! - OK  Telugu

రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తన కామెడీతో ప్రేక్షకులు మెప్పించిన రాజబాబు ఎందరో మనసును దోచుకున్నారు. ఆ టైంలో రాజబాబు లేని సినిమా ఉండేది కాదు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించడు రాజబాబు. ఆయన నటించే సినిమాలు ఆయనకు ప్రత్యేకంగా హీరోలతో సమానంగా సాంగ్ కూడా ఉండేది. ముఖ్యంగా రాజబాబు సీనియర్ యాక్టర్ రమాప్రభతో నటించిన సినిమాలో పాటలు ఎప్పటికీ మనకి ఎంతో నవ్వు తెప్పిస్తాయి. రాజబాబు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎందరికో దానాలు కూడా చేశారు.

రాజబాబు చనిపోయే రోజు కాగితంపై రాసిన చివరి మాటలు తెలిస్తే కన్నీళ్లే.

ఇక ఈయన ఫ్యామిలీ విషయానికొస్తే అయ‌కు ఇద్దరు కుమారులు మహేష్ బాబు, నాగేంద్రబాబు ఆయనకు పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే ఆయన భార్యతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆయన మరణించే సమయానికి ఆయన పిల్లలు వయస్సు కేవలం పది నుంచి 11 సంవత్సరాల మధ్యలోనే ఉంది. ఆయన భార్య రాజబాబు సంపాదించిన ఆస్తితో పిల్లలను పెంచింది. ప్రస్తుతం వారు విదేశాలలో సాఫ్ట్ వేర్ కంపెనీలను నడుపుతూ వందల కోట్లు సంపాదిస్తున్నారు.

Comedian Raja Babu assets: లెజెండరీ కమెడియన్ రాజబాబు ఆస్తుల చిట్టా తెలుసా..  అమెరికాలో సొంత కంపెనీ..! | Here the shocking facts about Tollywood  legendary comedian Raja Babu assets revealed by ...

రాజబాబు ఎంత ఆస్తి సంపాదించిన తన సొంత ఊరును మాత్రం మర్చిపోలేదు. సొంత ఊరిలో ఉన్న పేద ల‌కు తన సొంత భూములు కూడా దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. తన ప్రతి పుట్టినరోజున చిత్ర పరిశ్రమలో ఉన్న పేద కళాకారులకు దానధర్మాలు చేస్తూ తన గొప్ప మనసుని చాటుకున్నారు రాజబాబు. రాజబాబుకు కేవలం 46 సంవత్సరాల వయసులోనే గొంతు క్యాన్సర్ వచ్చింది. దానికి సంబంధించి ఆపరేషన్ చేయించుకుంటే జీవితాంతం మాట్లాడలేరు అని డాక్టర్లు చెప్పడంతో రాజబాబు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు.

Raja Babu Actor: 'హాస్య నట చక్రవర్తి'.. అప్పట్లోనే హీరోలతో సమానంగా  రెమ్యునరేషన్..

కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆపరేషన్ చేయించుకోగా అది కాస్త ఫెయిల్ అవ్వడంతో ఆయన మరణించాడు. ఆ టైంలో ఆయన తన కుటుంబ సభ్యులకు తన చివరి మాటలుగా ఓ లెటర్ రాసి ఇచ్చాడు. ఆ లెటర్ లో నేను ఎవరిని మోసం చేయలేదు భార్య, పిల్లలు, తమ్ముడు అందరూ బాగుండాలి నేను పోయాక నాకోసం ఎవరూ ఏడవద్దు అని ఆలెటర్‌లో రాసి వాళ్ళ అమ్మకి ఇచ్చి హాస్పిటల్ నుంచి బయటికి పంపించేశాడు. తర్వాత కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.