ఆ ఒక్క నిర్ణయం అనసూయని ఇంతకు దిగజార్చిందా..!

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ తో పాటు మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తూ తన అందంతో మంచి పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ స్టార్ గా కొనసాగింది. ప్రస్తుతం అనసూయ వరుస‌ సినిమా ఆఫర్లు సాకుగా చెప్పి జబర్దస్త్ షో నుంచి తప్పుకుని ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. మొన్నటి వరకు తన ఫ్యామిలీతో విదేశీ టూర్ వెళ్లి అక్కడ తను దిగిన హ‌ట్‌ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది అనసూయ.

Actress Anasuya Bharadwaj to play prostitute in her next

ఇప్పుడు తన పిల్లలతో కాలం గడుపుతూ ఖాళీగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మొన్న ఈ మధ్య అనసూయ తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు అనసూయ కెరియర్ ఫుల్ జోష్‌లో సాగిన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు ఇస్తానని చెప్పిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

కొడుకు మాటలకు భాగోద్వేగానికి గురైన అనసూయ! | Anchor Anasuya Emotional for  her son words

ఇక దీంతో అనసూయ జబర్దస్త్ షో కు రిఎంట్రీ ఇస్తుందనే టాక్ కూడా వచ్చింది. కానీ అది రూమర్స్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం అనసూయ ఆఫర్లు లేక ఖాళీగా ఉంటూ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతుంది. ఆమెకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా నచ్చకపోవడంతో షూటింగ్స్ కూడా వెళ్ళటం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక వచ్చే రోజులు అనసూయ కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా సినిమా మోజుతో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద రాంగ్ స్టెప్ వేసింది..!