తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ జూనియర్ ఇప్పుడు తాతనే మించి పోయే స్థాయికి రీచ్ అవుతున్నాడు . అందంలోనూ నటనలోనూ తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాడు.
కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవి రివిల్ కావట్లేదు అని నందమూరి ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అవుతున్న తరుణంలో సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో నందమూరి హీరో తో ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఒకరు నేషనల్ క్ర్ష్ రష్మిక మందనా..మరోకరు మృణాల్ ఠాకూర్. ట్రెడిషనల్ లుక్స్ లో మృణాల్..మోడ్రెన్ లుక్స్ లో రష్మిక హాట్ రోల్స్ తో మెప్పించబోతున్నారని తెలుస్తుంది.
కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం కాజల్ ని కొరటాల అప్రోచ్ అయ్యారట. ఆల్రెడీ ఎన్టీఆర్ -కాజల్ కొరటాల- కాంబోలో జనతా గ్యారేజ్ లో వచ్చిన పక్కా లోకల్ సాంగ్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసిందో తెలిసిందే. మళ్లీ అలాంటి కాంబో ని తెరపై ఫిక్స్ అవ్వడం జనాలకు పూనకాలు తెప్పిస్తుంది.
అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న కాజల్ సైతం ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది . కాజల్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి వర్క్ చేసే ప్రతి సినిమాలోను ఈ విషయం చెబుతూనే వస్తుంది . ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావించిన కాజల్ ఈ ఐటెం సాంగ్ ఓకే చేసినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే కొరటాల ఎన్టీఆర్ కాజల్ కాంబో కెవ్వు కేక అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.