తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి హ్యాపీడేస్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చూస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు తన అద్భుతమైన టాలెంట్ తో హీట్ పుట్టించే అందాలతో స్టార్ హీరోలను సైతం మెల్ట్ చేసి వాళ్ళ సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే చిరంజీవి ,నాగార్జున, వెంకటేష్ ,మహేష్ బాబు ,రామ్ చరణ్ ,ప్రభాస్, రామ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది .
కాగా ఇండస్ట్రీలో పరిస్థితిలో ఎప్పుడు ఒకేలాగ ఉండవు ఒకప్పుడు స్టాల్ హీరోయిన్గా వెలిగిన తమన్నా ప్రజెంట్ సినిమాలో అవకాశాలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది . అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆమె నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్ గా మారడంతో తమన్నాకు అవకాశాలు కరువయ్యాయి . ఈ క్రమంలోనే తమన్నా తన ఆశలన్నీ నెక్స్ట్ సినిమా గుర్తుందా శీతాకాలం పైనే పెట్టుకోనుంది . కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది .
ఆమె మాట్లాడుతూ ..” ఈ సినిమా నా కెరియర్లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇప్పటివరకు నాకు శీతాకాలం అంటే అస్సలు ఇష్టం లేదు. వేసవి కాలం అంటేనే నాకు చాలా ఇష్టం . అయితే ఈ సినిమాలో నటించిన తర్వాత శీతాకాలం పై ప్రేమ పెరిగింది . కచ్చితంగా శీతాకాలంని ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు అని తెలుసుకున్నాను. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా సత్యదేవ్ ని పెట్టమని సలహా చేసింది నేనే.. నాకు సత్యదేవ్ అంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి నటించాలని అనుకున్నాను. అందుకే ఈరోల్ వినగానే సత్యదేవైతే బాగుంటాడని డైరెక్టర్ కి సజెస్ట్ చేశాను. ఆయన సత్యదేవ్ ని అప్రోచ్ అవ్వగా సత్యదేవ్ కూడా ఓకే చెప్పడం హ్యాపీగా అనిపించింది. మా స్క్రీన్ స్పేస్ చాలా బాగుంటుంది . ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.