నందమూరి అందగాడు బాలయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా విండితెరపై చెలరేగిన బాలయ్య ఈమధ్య బుల్లితెరపై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆహా OTT వేదికగా సూపర్ హిట్ అయిన ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ స్టాపబుల్ షో ద్వారా విశేష జనాదరణ పొందాడు బాలయ్య. నిన్న మొన్నటివరకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే అతనిని ఇష్టపడేవారు. కానీ ఈ షో తరువాత అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాడు బాలయ్య.
ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోతే, బాలయ్య 108వ చిత్రం విశేషాలు గురించి తెలుసు కదా. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి NBK 108ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే ‘NBK108’ షూట్ ను మొదలు పెట్టబోతున్నట్టు వినికిడి. అయితే బాలయ్య సినిమాల విషయంలో ఓ సమస్య ఎప్పుడు వెంటాడుతుంది.
అదేమంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకకపోవడం. అవును, వారి క్రేజ్ కు తగ్గ హీరోయిన్లను ఎంపిక చేయడం వారికి సాహసంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో బాలయ్య సరసన నటించేందుకు తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అంతకుముందు నయనతారను సెలెక్ట్ చేశారని ప్రచారం జరిగినా ప్రస్తుతం నయన్ ఫ్యామిలీకే టైం కేటాయించడంతో ఆ ఛాన్స్ తెలుగు హీరోయిన్ కి దక్కిన్టట్టు తెలుస్తోంది.