పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఊగిపోయే ఫాన్స్ ఎంతోమంది ఉన్నారు, ఆయన్ని హీరోలా కాకుండా దైవంలా భావించి ఆరాధించే అభిమానులు కోట్లలోనే ఉంటారు. ఆయన ఒక్క మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోట్లలోనే ఉంటారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఆయన నిజాయితీ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు. కాగా ప్రజెంట్ సినిమాలోను రాజకీయాలలోనూ యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దిల్ కుష్ అయ్యేలా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా ” బద్రి” సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన ఈ సినిమా మళ్లీ 4క్ వర్షన్ లో లో రిలీజ్ అవుతుండడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పిస్తుంది. 2000 ఏప్రిల్ 20న గ్రాండ్గా రిలీజ్ అయిన బద్రి సినిమా దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ 4క్ వర్షెన్ లో రిలీజ్ అవుతుండటం అభిమానులకి మంచి కిక్క్ ఇస్తుంది.
4 K, డీటీఎస్, క్యూబ్ లాంటి వాటితో సినిమాను రీ ఎడిట్ చేసి.. కొత్త హంగులు అద్దుతూ రిలీజ్ చేయబోతున్నారు . దీనికి సంబంధించిన వీడియోస్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అంతేకాదు ఈ సినిమా లో నటించడం ద్వారానే పవన్ – రేణు దేశాయ్ మధ్య ప్రేమ చిగురించింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండడంతో పవన్ -రేణు దేశాయ్ పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి .
అంతేకాదు ఈ సినిమా 4క్ వర్షెన్ ను పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ బద్రి చిత్ర బృందం మొత్తం కలిసి చూసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అదే నిజమైతే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ =రేణు దేశాయ్ తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ పవన్ మేనరిజం, డైలాగ్స్ ..అంతేకాదు ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఇష్టంగా వింటుంటారు. ఈ సినిమా పూరి జగన్నాథ్- పవన్ కళ్యాణ్ -రేణు దేశాయ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది .