మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కనుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఇప్పటికే తమన్నా ఖండించింది. తాజాగా మరోసారి తన పెళ్లి వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తమన్నా `గుర్తుందా శీతాకాలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నాను పెళ్లిపై ప్రశ్నించగా.. `నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. కొంతమంది నాకు ఎప్పుడో పెళ్లి చేసేసారు. ఒకసారి డాక్టర్.. మరోసారి బిజినెస్ మెన్ అంటూ ఏవేవో కథనాలు అల్లారు.
అవన్నీ పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే అందరితో నేనే చెబుతాను. పెళ్లి విషయంలో మా పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్. నటించడం అనేది నా లైఫ్` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తమన్నా కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.