అరుదైన అవార్డు సొంతం చేసుకున్న రామ్ చరణ్..చిరు ఎమోషనల్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక మెగా అభిమానులను సైతం రెట్టింపు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పైన దూసుకుపోతున్నారు రీసెంట్గా నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను అందుకున్నారు.దీంతో దేశ విదేశాలలో కూడా రామ్ చరణ్ పేరు బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక ప్రతిష్టాత్మకంగా అవార్డును స్వీకరించడం జరిగింది. ది ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డు రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు.

Ram Charan does 'Naatu Naatu' at NDTV event - Telugu News - IndiaGlitz.comఈ అవార్డుతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ అవార్డు దక్కడం వల్ల రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాకు సంబంధించి ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్లు చేయడం జరిగింది.నాన్న నిన్ను చూస్తుంటే చాలా త్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత నిన్ను చూస్తే మరింత గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.

తమ అభిమాన హీరో రామ్ చరణ్ కు ఇలాంటి అవార్డు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ చిత్రానికి RC -15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో హీరోయిన్గా కియార అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రమే కాకుండా RC -16 సినిమాని కూడా గౌతమ్ చిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్నారు.