కొరటాల కొత్త ఐడియా.. పాన్ ఇండియా హీరోలకు చుక్కలే..!

కొరటాల శివ రైటింగ్ స్టైల్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలంటే రొట్ట‌ మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ను కూడా కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివకు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాలకు ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొరటాల ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది.

Koratala Siva Reveals Interesting Detail about Acharya Movie

అపజయం అంటే తెలియని కొరటాలకు మొదటిసారి డిజాస్టర్ ఇచ్చేసరికి ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కొరటాలని టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ డిజాస్టర్ నుంచి బయట పడాలని కొరటాల తర్వాత చేయబోయే ఎన్టీఆర్ సినిమా కోసం భారీ కసురత్తులు చేస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేసి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టలేదు.

Jr. NTR Reunites With Director Koratala Siva For An Upcoming Film

ఇంకా కొరటాల ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బోన్స్ బ్యాక్ అవ్వాలని తన మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ ను ఈ సినిమాతో హిట్‌ కొట్టి తన్ను తాను నిరూపించుకోవాలని కొరటాల ఎంతో కసిగా ఉన్నాడు. ఇలాంటి ఇంత భారీ డిజాస్టర్ తర్వాత ఇన్ని విమర్శలు వచ్చిన ఎన్టీఆర్ కొరటాల మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

NTR 30: Jr NTR teams up with Janatha Garage director Koratala Siva for next  film, motion poster out

ఏకంగా ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాలని పాన్ ఇండియా దర్శకుడుగా తన సినిమాతో పరిచయం చేయబోతున్నాడు. దీంతో ఎన్టీఆర్ కొరటాల మీద ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కొరటాల ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తనలో నుంచి ఒక కొత్త రైటర్ ని బయటకు తీయాలి.. మాస్ డోస్‌ పెంచాలి రిపేర్లు పాన్ ఇండియా స్థాయిలో చేయాలి.

వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి 2023 దసరా కానుకగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేయడానికి ఎన్టీఆర్, కొరటాల సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో కొరటాల ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.