మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది.

ఈ క్రమంలోనే తాజాగా రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు, నేతలతో జగన్ భేటీ అయ్యారు. అక్కడ ఉన్న సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ సారి కూడా మైలవరం గెలిపించుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏమైనా విభేదాలు ఉంటే వసంత-జోగి వచ్చి తనని కలవాలని చెప్పారు. కానీ సీటు విషయం తేల్చలేదు. సీటు విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని వసంత చెప్పారు. కానీ వసంతకు సీటు లేదని, నెక్స్ట్ మైలవరం సీటు జోగికే అని ప్రచారం వస్తుంది.

సంక్షేమ పథకాల అమలు తీరుపై బూత్ కమిటీల పరిశీలన: మైలవరం వైసీపీ నేతలతో సీఎం  జగన్ భేటీ

అయితే జోగి సొంత స్థానం మైలవరం..2014లో ఇక్కడే దేవినేని ఉమాపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం జోగి పెడన వెళ్ళి పోటీ చేశారు. ఇటు మైలవరంలో వసంత పోటీ చేశారు. ఈ ఇద్దరు గెలిచారు. జోగికి మంత్రి పదవి దక్కింది. ఇక ఇరువురు నేతలకు తమ స్థానాల్లో వ్యతిరేకత వస్తుందని సర్వేల్లో వస్తుంది. దీంతో జగన్ సీట్లు మారుస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇటు జోగి ఏమో మళ్ళీ తన సొంత స్థానానికి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వసంతకు సీటు ఇవ్వడం డౌటే అని ప్రచారం వస్తుంది. మైలవరంలో వసంతకు బాగా వ్యతిరేకత ఉందని, మళ్ళీ పోటీ చేస్తే గెలవరని టాక్ వస్తుంది..దీంతో వసంతని తప్పించి..జోగికి మైలవరం సీటు ఇస్తారని, ఇటు పెడన సీటు జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముకు ఇస్తారని ప్రచారం వస్తుంది. మరి చివరికి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.