తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా చిన్న పాత్రలలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఇక తర్వాత ఈమె ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇక అందులో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది తేజస్విని.
బిగ్ బాస్ లోనుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ఆఫర్లు రాబట్టుకోలేక పోయింది. అలాగే టీవీ షోలో కూడా ఎక్కడ కనిపించలేదు. కేవలం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే తన ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది అభిమానులకు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తన అందాలను ప్రదర్శించడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందని ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. తన అందాలను చూపించడంలో స్టార్ హీరోయిన్లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు.
తాజాగా తేజస్వి మదివాడ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన ఆప్తుడు రోహన్ యొక్క పెళ్లి వేడుకలలో తేజస్వి అక్కడ అందరిని ఆకట్టుకుంటోంది .అంతేకాకుండా ఆమె చేసిన డాన్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.పెళ్లికి సింపుల్ అండ్ స్వీటీగా పసుపు కలర్ చీర కట్టుకొని కనిపించి ఊర మాస్ డాన్స్ వేస్తూ తేజస్విని కనిపిస్తోంది. ఈ డాన్స్ చూసిన అభిమానులు నేటిజనులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ ఎనిమిది సంవత్సరాల తర్వాత శ్రేయాన్స్ ను కలిశాను అప్పటిలాగే ఇప్పుడు కూడా ఉంది ఏమి మారలేదంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram