ఆ సీనియ‌ర్ హీరోపై మంచు ల‌క్ష్మి మోజు.. ప్ర‌తి ఏడాది అత‌డితో చేయాల‌ట‌!

కలెక్షన్ కింగ్ మోహన్బాబు మొదల కూతురు మంచు లక్ష్మి ఓ సీనియ‌ర్ హీరోపై మోజు ప‌డింది. ఆ సీనియ‌ర్ హీరోతో ఏడాదికొక సినిమా చేయాల‌ని ఉందంటూ మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రీసెంట్గా మంచు ల‌క్ష్మి `మాన్‌స్టార్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.

మ‌ల‌యాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వైసక్ దశకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయింది. మంజు దుర్గ అనే పాత్ర‌ను మంచు ల‌క్ష్మి పోషించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా మంచు లక్ష్మి పాత్ర అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులో లెస్బియన్ రోల్ చేసిందామె. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాలు మంచు లక్ష్మీ ఎలాంటి మొహమాటం లేకుండా నటించింది.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి.. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే మోహన్ లాల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `మోహన్‌లాల్‌ నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఇప్పటికీ తన కెరీర్‌లో ఛాలెంజింగ్‌ మూవీస్‌ చేస్తున్నారు. ప్ర‌తి ఏడాది ఆయ‌న‌తో ఒక సినిమా చేయాల‌నుంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మంచు ల‌క్ష్మి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.