చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసే లక్ష్యంగా ముందుకెళుతుంది. గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక కుప్పం సీటులోనే టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి ఆ సీటు కూడా గెలుచుకుని జిల్లాని క్లీన్ స్వీప్ చేసే బాధ్యత అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన జిల్లాపై ఏ స్థాయిలో ఫోకస్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కుప్పం టార్గెట్ గా ముందుకెళుతున్నారు. అక్కడ టీడీపీని దెబ్బకొట్టే విధంగా ఎత్తులు వేస్తూ వచ్చారు.
ఇదే క్రమంలో పంచాయితీలు, పరిషత్, మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నారు..ఇక కుప్పంలో తమదే పైచేయి అనే విధంగా పెద్దిరెడ్డి హవా కొనసాగిస్తున్నారు. అయితే అనుకున్న విధంగా చిత్తూరులో పెద్దిరెడ్డి ఆపరేషన్ సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లాలో కొన్ని సీట్లలో టీడీపీ బలపడుతుంది. కుప్పంలో ఎన్ని చేసిన అక్కడ చంద్రబాబుకే పరిస్తితులు అనుకూలంగా ఉన్నాయి. అదే కాదు పీలేరు, పలమనేరు, నగరి, మదనపల్లె, తిరుపతి లాంటి సీట్లు సైతం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి మరింత దూకుడు పెంచారు. జిల్లాపై పట్టు పెంచుకోవడానికి గట్టిగా కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో నల్లారి ఫ్యామిలీ చేతుల్లో ఉన్న పీలేరుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి పెద్దిరెడ్డి-నల్లారి ఫ్యామిలీలకు పెద్దగా పడలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి వైసీపీలో, నల్లారి టీడీపీలో ఉన్నారు. పీలేరు బాధ్యతలని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చూస్తున్నారు.
అయితే ఇప్పుడు అక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి పీలేరులో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు..అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇంకా పలువురు టీడీపీ నేతలని టీడీపీలోకి తీసుకొచ్చారు. మరి ఈ ఆపరేషన్ వల్ల పీలేరులో నల్లారి బలం తగ్గుతుందో లేదో చూడాలి.