పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన సినిమాలతో ఆయన అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కథల ఎంపికలు కూడా ఆయన అభిమానులకు నచ్చటం లేదు.
ఆయన సినిమాలకు రీయంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి వరుస రీమిక్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో రీమిక్ సినిమా పవన్ చేయబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి పవన్ తేరి రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు బయటకు రావడంతో ఆయన అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు.’we don’t want Theri remake’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఓ లేడీ అభిమాని మీరు తేరి రీమిక్ చేస్తే నేను చచ్చిపోతాను అంటూ సూసైడ్ లెటర్ రాసింది. ఎప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ లెటర్ ను దర్శకుడు హరీష్ శంకర్ కి మైత్రి మూవీ మేకర్స్ కి .. అనువదించే విధంగా.. ‘సార్ నేను ఇప్పటివరకు ఏ లెటర్ కూడా రాయలేదు.. ఇలా సూసైడ్ లెటర్ రాస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఎన్ని రీమెక్ సినిమాలు తీసిన నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు’.
‘కానీ మీరు తేరి రీమేక్ పవన్ కళ్యాణ్ తో తీస్తారని తెలిశాక ఈ లెటర్ రాయకుండా ఉండలేకపోతున్నా.. కనీసం నా చావు చూసిన మీరు ఈ రీమేక్ సినిమాను క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నా.. ఆదివారం వస్తే మాటీవీలో తేరి సినిమాని ఇప్పటికి పది సార్లు చూసుంటాను.. దయచేసి మీరు ఈ రీమేక్ ని క్యాన్సిల్ చేయండి’. ‘మీరు క్యాన్సిల్ చేయకపోతే నా చావుకు మైత్రి మూవీ మేకర్స్- హరీష్ శంకర్ కారణం అవుతారని ఆమె రాసుకు వచ్చింది’. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లెటర్ పై హరీష్ శంకర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.