ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు. బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్ వంటి జానర్‌లో కూడా బాలకృష్ణ సినిమాలు చేశారు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో ఇన్ని జోనర్లో సినిమాలు చేసిన ఏకైక నటుడు బాలకృష్ణనే.
అయితే ఇప్పుడు బాలకృష్ణ మరో పౌరాణిక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ బాలకృష్ణతో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ ఈ సినిమాలో తాత్విక వేత్త స్వామి రామానుజాచార్యగా నటించబోతున్నారని తెలుస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
బాలకృష్ణ డేట్‌లు సర్దుబాటైన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ అనిపిస్తుంది. తన జీవితం మొత్తం వైష్ణవ మత ప్రచారం చేసిన విశ్వ గురువు రామానుజాచార్య జీవిత కథను బాలకృష్ణతో తీయాలన్నది తన కోరికని మరోసారి సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఈ సీనియర్ ప్రొడ్యూసర్ బాలకృష్ణతో పరమవీరచక్ర, రూలర్, జై సింహ వంటి సినిమాలను నిర్మించారు.
బాలకృష్ణతో చేయబోయే రామానుజాచార్య బయోపిక్ ను దర్శకేంద్రుకే రాఘవేంద్రరావు తెరకెక్కిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ రూపకల్పనలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురువు చిన్న జీయర్ స్వామి సహకారాలు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తారా.. రామానుజాచార్య పాత్రలో వెండి తెరపై మెరుస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.