థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న కనెక్ట్ మూవీ లో హీరోయిన్ గా నటించబోతోంది నయనతార. ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వినయ్ రాయ్, హనీయా నఫీషా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా విగ్నేష్ శివన్ .. రౌడీ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి పృధ్వి చంద్రశేఖర్ గానం అందించబోతున్నాడు.
ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆన్లైన్లో నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు.ఈ ఆవిష్కరణ రెబల్ స్టార్ చేతులు మీదుగా జరిగింది. ట్రైలర్ చూస్తుంటే భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచే విదంగా ఉంది. ఒక చిన్న అందమైన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపే ఇల్లాలు కానీ భారతదేశంలో ఆకస్మిక లాక్డౌన్ సమయంలో ఆమె తన కూతురి ప్రవర్తనలో అనూహ్యమైన మార్పును చూసి కంగారు పడుతుంది. వేరే ఆప్షన్ లేని పరిస్థితుల్లో సుసాన్ తన కుమార్తెకు ఏం జరిగిందో తెలుసుకోవటానికి భూతవైద్యున్ని సహాయం కోరుతుంది. తన కూతుర్ని మళ్లీ మామూలుగా చేయడంలో విజయం సాధిస్తుందా?.. లేదా? అన్నదానికి సమాధానం తెలియాలంటే థియేటర్లలో సినిమా వీక్షించాల్సిందే. కెమెరా పనితనం , రీ రికార్డ్ ఈ సినిమాకి ప్లస్ కానుంది.ఇక లాక్ డౌన్ కి 24 గంటల ముందు జరిగే కథలు చాలా ట్విస్టులతో ఈ సినిమా కొనసాగుతుందని ట్రైలర్లో కనిపిస్తోంది.
అయితే ఇందులో నయనతార కూతురికి దెయ్యం పట్టడం.. ఈ సినిమాలో ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ భారీ తారాగణంతో పని లేకుండా ఇంట్లోనే చీకట్లో శబ్దాలు వినిపిస్తుంటే అక్కడ ఏదో జరుగుతుందనీ థ్రిల్ ని కలిగించేలా సన్నివేశాలను ఎలివేట్ చేసిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు మనుషులకు, ఆత్మలకు లింక్ ఏంటి అని తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.. ఈ మూవీ కాస్త డార్క్ షేడ్ విజువల్ తో మనుషులపై గాడమైన ముద్ర వేస్తుందని ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.