జవహర్-సుజాతకు బాబు షాక్..తేల్చేసినట్లేనా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా టీడీపీలో ఇంచార్జ్‌లు లేని నియోజకవర్గాలు ఉన్నాయి. కొందరు నేతలు ఇంచార్జ్ పదవుల కోసం పోటీ పడటం, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పెరిగింది. దీంతో చంద్రబాబు ఎవరికి పదవి ఇవ్వకుండా అలా ఉంచేశారు. జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, చింతలపూడి, పోలవరం స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు.

కానీ ఈ స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఒకరికి సీటు ఇస్తే మరొకరికి తంటా అన్నట్లు పరిస్తితి ఉంది. అందుకే ఈ సీట్లని పెండింగ్ లో పెట్టారు. వీటిల్లో ముఖ్యంగా చింతలపూడి, కొవ్వూరు స్థానాల్లో రచ్చ ఎక్కువ ఉంది. ఈ రెండు టీడీపీ కంచుకోటలే. కానీ ఇక్కడ ఆధిపత్య పోరు టీడీపీ కొంపముంచుతుంది.  అయితే కొవ్వూరు సీటు కోసం కే‌ఎస్ జవహర్, చింతలపూడి సీటు కోసం పీతల సుజాత ట్రై చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు టీడీపీ నుంచి గెలిచారు..మంత్రులుగా కూడా చేశారు.

కానీ 2019 ఎన్నికల్లో వీరిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది..దీంతో బాబు వీరిని పక్కన పెట్టేశారు. కాకపోతే జవహర్‌కు తిరువూరు సీటు ఇచ్చారు. సుజాతకు సీటు ఇవ్వలేదు. ఇక తిరువూరులో ఓడిన జవహర్..మళ్ళీ కొవ్వూరుకు వచ్చేశారు. కానీ అక్కడ ఆయన వ్యతిరేకత వర్గం మాత్రం..గట్టిగా ఫైట్ చేస్తుంది. ఎట్టి పరిస్తితుల్లోనూ జవహర్‌కు సీటు ఇవ్వకుండా చూస్తుంది. జవహర్ మాత్రం కొవ్వూరు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.

అటు సుజాత..చింతలపూడి సీటు కోసం చూస్తున్నారు..ఇక్కడ ఈమెకు వ్యతిరేక వర్గం ఉంది. దీంతో ఈ సీటు ఇచ్చే విషయంలో బాబు ఆలోచిస్తున్నారు. అయితే కొవ్వూరులో ఓ ఎన్‌ఆర్‌ఐకి సీటు ఇచ్చి, జవహర్‌ని పక్కన పెట్టాలని చూస్తున్నారని తెలిసింది. ఇటు చింతలపూడిలో కూడా సుజాతకు హ్యాండ్ ఇస్తారని తెలుతోంది. మొత్తానికి జవహర్, సుజాతలకు సీట్లు డౌటే అని చెప్పవచ్చు.