పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే అభిమానులలోనే కాదు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు ఓపెనింగ్ సాధిస్తూ ఉంటాయి ఆయన సినిమాలు.. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి బాగా పాపులర్ అయింది మౌనిక రెడ్డి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో మొదటి 15 నిమిషాల పాటు జరిగే ఎపిసోడ్లో ఆమె కనిపిస్తుంది. అయితే రానా కారణంగా సస్పెండ్ అయ్యే కానిస్టేబుల్ గా ఈమె నటించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించిన ఈమె సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో కూడా బిజీబిజీగా తన కెరియర్ను సాగిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మౌనిక భర్త పేరు సందీప్.. అతడు ఒక సింగర్ అట. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది మౌనిక రెడ్డి
మౌనిక రెడ్డి కొన్ని ఫోటోలు షేర్ చేసి పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వగా.. ఈ వార్త తెలిసి ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు నేటిజన్లు. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో కెరియర్ కొనసాగిస్తుందా? లేక వైవాహిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా మౌనిక భర్త సూపర్ హ్యాండ్సమ్ అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.