ఏపీలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలాంటి వారి లిస్ట్‌ని జగన్ సిద్ధం చేసుకుని, వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఫిక్స్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈలోపు ఎమ్మెల్యేలని గడపగడపకు పంపించి..వారి పనితీరుని మెరుగు పర్చుకోవాలని సూచించారు. కానీ కొంతమంది ఈ అంశంలో కూడా ఫెయిల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక కొందరు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లకుండా తమ వారసులని తిప్పడం..మరికొందరు తమ బంధువులకు పెత్తనం ఇవ్వడం చేస్తున్నార్రు. అలాంటి వారికి జగన్ షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో తాను కాకుండా తన పిఏని నియోజకవర్గంలో తిప్పుతున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు జగన్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఈయనపై వ్యతిరేకత ఎక్కువ ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేల్లో వస్తుంది. ఇలాంటి తరుణంలో ఈయన ప్రజలకు దగ్గర కాకుండా..పిఏకు పెత్తనం అప్పగించి వేడుక చూస్తున్నట్లు తెలిసింది.
దొరబాబుకు వీరంరెడ్డి చక్రి పిఏగా ఉన్నారు..ఇక ఈయన నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. ఎలాంటి కార్యక్రమమైన ఈయన చేతులు మీదుగా జరగాల్సిందే..ఇక ఇక్కడ చక్రి చెప్పిందే వేదం. ఎవరైకైనా పథకాలు రావాలన్న, కాంట్రాక్టులు దక్కాలన్న..ట్రాన్స్‌ఫర్లు కావాలన్న ఈయనే చూసుకుంటారు. ఇక ఈయన పెత్తనానికి సొంత పార్టీ వాళ్లే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినా సరే చక్రిని ఎమ్మెల్యే వెనుకేసుకుంటూ వస్తున్నారట.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చక్రి..ఉపాధి హామీ పథకానికి సంబంధించి చిన్న ఉద్యోగి..ఇప్పటికీ అందులో జీతం కూడా తీసుకుంటున్నారట. ఇలా పిఏ హవా పెరగడంతో పిఠాపురంలో వైసీపీకి నెగిటివ్ తారాస్థాయికి చేరింది. దీంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది..ఎట్టి పరిస్తితుల్లోనూ పిఏని పక్కన పెట్టాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో నెక్స్ట్ దొరబాబుకు సీటు ఇచ్చే విషయం కూడా డౌటే అని తెలుస్తోంది.