చిరంజీవి బిగ్ ఫెయిల్యూర్ మ్యాన్ అంటున్న వర్మ.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన డేంజరస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వర్మ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sorry for the criticism I made in the past: RGV apologises to all  Chiranjeevi fans

డేంజరస్ సినిమా గురించి మాట్లాడిన తర్వాత.. వర్మ ని యాంకర్ పలు ప్రశ్నలు అడగడం జరిగింది. చిరంజీవి సినిమాలలోకి రాకపోయి ఉంటే మరే రంగంలో రాణించేవారని ప్రశ్న యాంకర్ వర్మ అని అడగగా.. చిరంజీవి యాక్టింగ్ కెరియర్ లో కాకుండా మిగతా అన్ని రంగాలలో ఒక బిగ్ ఫెయిల్యూర్ గా నిలిచారని ఆయనకు ఉన్న మెంటాలిటీకి సినిమాలు కాకుండా ఏది చేసిన పెద్ద ప్లాప్ అయ్యే వారిని తన ఫీలింగ్ అని తెలియజేశారు వర్మ. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నారు ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నది. కీలకమైన పాత్రలో రవితేజ నటిస్తూ ఉన్నారు. వర్మ చేసిన ఈ కామెంట్స్ పై మెగా అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.