ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైనస్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జగన్కు ఇప్పుడు గట్టి దెబ్బే తగిలింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుందని కేంద్రం కుండబ ద్దలు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకున్నట్టు పేర్కొంది.
అయితే.. దీనిని అధికార పార్టీ నాయకులు లైట్ తీసుకునే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు జరగలేదా? అని కూడా ఎదురు దాడి చేయొచ్చు. అయితే.. అప్పట్లో కేంద్రంఇంత గా అయితే నివేదిక ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి.. నివేదిక ఒకటి రెడీ చేసింది. దీని ప్రకారం ఏపీలోనే ఎక్కువగా మాదక దవ్యాలైన హెరాయిన్, కొకైన్, గంజాయి వంటివిఅక్రమ రవాణా అవుతున్నాయని పేర్కొంది.
ఈ విషయంపై వైసీపీ నాయకులు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అదే వేరే విషయంలో ఏపీ ముందుంద ని అంటే..వెంటనే నాయకులు మీడియా ముందుకు వచ్చి.. అధినేతపై భజన చేసేవారు. “ఓ రబ్బయా.. ఓరబ్బయా..“ అంటూ.. దండకాలుసైతం అందుకునేవారు. కానీ, ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ వచ్చింది ఏకంగా మాదక ద్రవ్యాల్లో. దీంతో ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు.
అయితే, దీని వల్ల ఏంటి నష్టం అనే చర్చ కూడా జరగొచ్చు. ఉంది! మాదకద్రవ్యాలు ఎక్కువగా రవాణా అవుతున్నా.. వినియోగిస్తున్నా.. అలాంటి రాష్ట్రాల్లోకి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టరు. ఎందుకం టే మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సజావుగా ఉండనిపారిశ్రామిక వర్గాలు జంకుతాయి. సో.. వారు పెట్టుబడులు పెట్టేందుకు రారు.
అదేసమయంలో విదేశాలు కూడా పెట్టుబడులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపవు. ఇదిలావుంటే.. కేంద్రం పెత్తనం.. పెరుగుతుంది. తరచుగా దాడులు జరుగుతుంటాయి. నార్కోటిక్స్ అధికారులు. ఈ డీ అధికారులు రాష్ట్రానికి వస్తు పోతుంటారు. పలితంగా పారిశ్రామిక వేత్తలు కూడా తమకు ఇబ్బందులు తప్పవనిభావించి వారు కూడా దూరం జరుగుతారు. ఇలా మొత్తంగా రాష్ట్రంపై ఈ మాదక ద్రవ్యాల ప్రభావం పరోక్షంగా పెద్ద కుదుపునకే దారితీయనుంది. మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.