యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది ఈ మూవీని అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పటివరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జాన్వీ కపూర్, రష్మిక, అలియా భట్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ, ఫైనల్ గా తారక రాముడి కోసం సీతామహాలక్ష్మి అదేనండి మృణాల్ ఠాకూర్ ను సెట్ చేశారట. ఈ అమ్మడు ఇటీవల `సీతారామం` సినిమాలో సీతగా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు జోడీగా మణాల్ ను ఎంపిక చేశారని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానందని అంటున్నారు.